2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మనల్ని కొట్టిన చావు దెబ్బ ఎప్పటికీ మర్చిపోలేం. ధోనిని రనౌట్ చేసి మన చేతుల్లో నుంచి వరల్డ్ కప్ కలలను లాగేసుకున్న న్యూజిలాండ్ కి నిన్న రాత్రి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో బదులిచ్చేసింది భారత జట్టు. కివీస్ విసిరిన టార్గెట్ ను రోహిత్ అండతో శ్రేయస్ , కేఎల్ రాహుల్ హల్వా పూరీలా ఊదేస్తే...జడ్డూ విన్నింగ్ షాట్ తో టీమిండియా సగర్వంగా మినీ వరల్డ్ కప్ ను ముద్దాడింది. అంతే గ్రౌండ్ లోకి పరిగెత్తుకుని వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కొహ్లీ చెరో స్టంప్ ను చేతిలోకి తీసుకుని కోలాటం ఆడారు. ఇది రోహిత్ , కొహ్లీ ఆడిన కోలాటం కాబట్టి ఫ్యాన్స్ దీనికి రో కోలాటం అని పేరు పెట్టారు. గడచిన నెలరోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ మీద ఫుల్ కాన్సట్రేట్ చేసిన టీమిండియా అందుకు తగిన ఫలితం విజయం రూపంలో ఫలించగానే ఎమోషనల్ అయిపోయారు అంతా. స్టాండ్స్ లో ఉన్న తమ ఫ్యామిలీస్ కి దగ్గరకు వెళ్లి పోయి వాళ్లతో తమ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. రోహిత్, రితిక - కొహ్లీ, అనుష్క, జడ్డూ- రివాబా ఇలా స్టార్ క్రికెటర్లంతా తమ కుటుంబాలతో గ్రౌండ్ ఆనందమైన ఆ క్షణాలను పంచుకుని హ్యాపీ గా గడిపారు. ఛాంపియన్స్ ట్రోఫీకే ప్రత్యేకమైన వైట్ కోట్స్ వేసుకుని ట్రోఫీతో రకరకాల ఫోజులు ఇస్తూ ఫుల్ టూ ఎంజాయ్ చేశారు టీమిండియా ఆటగాళ్లు. గాంగ్నమ్ స్టైల్ డ్యాన్సులు వేస్తూ నోస్టాల్జియా ఫీలయ్యారు. పెద్దగా దేనికీ నవ్వన గంభీర్ మొహంలోనూ ఫుల్ స్మైల్ కనిపించింది అంటే విక్టరీ పెద్దది అనేగా అర్థం.